Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెన్నైలో రోడ్డు ప్రమాదం.. భారతీయ రేసర్ అశ్విన్, అతని భార్య సజీవ దహనం

శనివారం, 18 మార్చి 2017 (10:46 IST)

Widgets Magazine
aswin sundar

చెన్నైలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ రేసల్ అశ్విన్ సుందర్, అతని భార్య సజీవ దహనమయ్యారు. తన భార్య నివేదితతో కలసి కలసి అతను ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. 
 
చెన్నై నగరంలోని శాంథోమ్ హైరోడ్డులో రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులో ఇరుక్కుపోయిన అశ్విన్, అతని భార్య ఈ ఘటనలో సజీవ దహనం అయ్యారు. అశ్విన్ మరణవార్తతో అందరూ షాక్ కు గురయ్యారు.
 
భారతీయ ఎఫ్4 రేసర్ అశ్విన్ సుందర్ గత 1985 జూలై 27 న చెన్నైలో జన్మించారు. 2003లో ఎంఆర్ఎఫ్ ఫార్ములా మోండియల్ నేషనల్ ఛాంపియన్ షిప్‌ను తొలిసారి గెలుచుకున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎఫ్4 నేషనల్ ఛాంపియన్‌గా అవతరించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం అశ్విన్ ప్రతిభను కనబరిచారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

సాయ్ పాలక మండలి సభ్యురాలిగా గుత్తా జ్వాల.. ఖుషీ ఖుషీగా ఢిల్లీకి..

2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌‌లో రజతంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన ...

news

ఇండియన్ వెల్స్ మ్యాచ్.. 36వసారి పోటీపడిన ఫెదరర్-నాదల్.. స్విజ్ మాస్టర్‌దే గెలుపు

ఇండియన్ వెల్స్ మాస్టర్స్‌లో స్విజ్ మాస్టర్‌ రోజర్ ఫెదరర్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ ...

news

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత ...

news

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో ...

Widgets Magazine