పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భనీనా పటేల్ - ప్రశంసల వర్షం
టోక్యో వేదికగా పారాలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లోభాగంగా టేబుల్ టెన్నిస్ పోటీలో భారత్‌కు సిల్వర్ పతకం లభించింది. ఈ పోటీల్లో గుజరాత్‌కు చెందిన క్రీడాకారిణి భవీనా బెన్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించి భారత్‌కు పతకాన్ని అందించారు. ముఖ్యంగా, పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో దేశానికి పతకం రావడం ఇదే తొలిసారి. దీంతో ఆమెపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో వెండి పతకాన్ని సాధించిన భవీనాబెన్ పటెల్ దేశంలోని క్రీడాకారుల్లో, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఆమె నిబద్ధత, నైపుణ్యాల వల్ల దేశానికి మంచి పేరు వచ్చిందని చెప్పారు. ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించిన ఆమెకు అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా భవీనా పటేల్‌కు అభినందనలు తెలిపారు. ఆమె చరిత్ర లిఖించిందని, ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తివంతమైందన్నారు. ఆమె జీవిన ప్రయాణం దేశంలోని యువతను క్రీడ వైపునకు ఆకర్షిస్తోందన్నారు.
భవీనా బెన్ పటేల్‌కు రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె సాధించిన విజయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.