బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 జులై 2016 (22:10 IST)

ఒక్కో ఆటగాడికి 42 కండోమ్‌లు... జికా వైరస్ ఉంది... మీ ఇష్టం మరి...

ఆగస్టు నెల 5న బ్రెజిల్ నగరంలో రియో ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి. ఐతే క్రీడలు, వాటి రికార్డుల గురించి కాకుండా సెక్సుకు సంబంధించిన విషయాలే బ్రెజిల్ లో చర్చ జరగడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే.... ఇక్కడ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఒక్కొక్కరికి

ఆగస్టు నెల 5న బ్రెజిల్ నగరంలో రియో ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి. ఐతే క్రీడలు, వాటి రికార్డుల గురించి కాకుండా సెక్సుకు సంబంధించిన విషయాలే బ్రెజిల్ లో చర్చ జరగడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే.... ఇక్కడ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఒక్కొక్కరికి 42 కండోమ్ లను సరఫరా చేస్తామని నిర్వాహకులు తెలియజేయడం. 
 
ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల నుంచి 11 వేల మంది ఆటగాళ్లతో పాటుగా 7 వేల మంది సిబ్బంది వస్తున్నారు. వీరందరికీ అన్ని సదుపాయాలను కల్పించడంతో పాటు 4.50 లక్షల కండోమ్‌లను తెప్పించారట. వీటిని అందరికీ పంచడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కండోమ్ లేకుండా శ్రుంగారంలో పాల్గొనవద్దని సూచనలు చేసేందుకు మనుషులను కూడా నియమిస్తున్నారట. ఇక్కడ జికా వైరస్ లైంగిక చర్య ద్వారా సంక్రమించడాన్ని గుర్తించారు. అందువల్లనే ముందుజాగ్రత్త చర్యగా కండోమ్ లను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.