గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (14:42 IST)

సైనాకు గాయాలతో తంటా: కామన్వెల్త్ నుంచి అవుట్!

ఏసీ షట్లర్ సైనా నెహ్వాల్‌కు గాయాలు దెబ్బకొట్టాయి. వచ్చేవారం కామన్వెల్త్ క్రీడలు ఆరంభం కానుండగా భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సందర్భంగా పాదాలకైన గాయాల నుంచి ఇంకా కోలుకోలేదని సైనా పేర్కొంది. కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవడానికి గానీ, గాయాల నుంచి కోలుకోవడానికి గానీ తగినంత సమయం లేదని వాపోయింది. 
 
కామన్వెల్త్ క్రీడలు ఈ నెల 23 నుంచి ఆగస్టు 3 వరకు బ్రిటన్ లోని గ్లాస్గో నగరంలో జరగనున్నాయి. కాగా, ఈ క్రీడల్లో భారత్‌కు పతకం లభిస్తుందని భావిస్తున్న అంశాల్లో బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఇప్పుడు సైనా వైదొలగడంతో భారత బృందంలో నిరాశ అలుముకుంది. 
 
అయితే కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్‌లో బంగారం పథకం సాధించి తీరుతానని ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ధీమా వ్యక్తం చేశాడు. అదే తన ఏకైక లక్ష్యమని, అటు వరల్డ్ నంబర్ వన్ షట్లర్ లీ చాంగ్ వీ టోర్నమెంట్ నుంచి విరమించుకోవడంతో, రెండో సీడ్ ఆటగాడైన తనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. తప్పకుండా తాను గోల్డ్ మెడల్ సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.