శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (14:57 IST)

సైనా నెహ్వాల్ ప్రేమ-పెళ్లి: షారూఖ్ ఖాన్ బాయ్ ఫ్రెండ్‌గా.. దీపికా..?

చైనా బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గిన భారత షట్లర్ సానియా మీర్జా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా తన వ్యక్తిగత విషయాలను కూడా తెలిపింది. 
 
షట్లర్‌గా లవ్ చేసేందుకు ప్రస్తుతం టైమ్ లేదని, ఎప్పుడూ ప్రయాణాలు మ్యాచ్‌లతో జీవనం సాగిపోతుందని సైనా చెప్పింది. ఇంకా మెరుగ్గా ఆడటంపై దృష్టి పెట్టి, టైటిల్స్ గెలుచుకుంటానని తెలిపింది. ఇందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది. 
 
మేరీ కోమ్‌లా సైనా జీవిత కథ ఆధారంగా వస్తే తన పాత్రను దీపికా పడుకునే పోషిస్తే బాగుంటుందని సైనా ఠక్కున బదులిచ్చేసింది. 
 
అలాగే షారూఖ్ ఫ్యాన్-దీపికా హిట్ ఫెయిర్. బయోఫిలిమ్‌లో షారూఖ్‌ బాయ్‌ఫ్రెండ్‌గా నటిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకు సైనా పెద్దగా నవ్వుతూ సమాధానమిచ్చింది. షారూఖ్ తన బాయ్ ఫ్రెండ్‌గా బయోఫిక్‌లో నటిస్తే హ్యాపీగా ఫీలవుతానని, ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు సైనా చెప్పుకొచ్చింది.