శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (19:07 IST)

సానియా జోడీ జోరు : టోక్యో డబుల్స్ టైటిల్ కైవసం!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాంచి ఫామ్‌లోకి వచ్చింది. ఇటీవలే యూఎస్ ఓపెన్ డబుల్స్ సాధించిన ఈ అమ్మడు.. తన భాగస్వామి కారా బ్లాక్‌తో కలిసి మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 
 
టోక్యోలో జరుగుతున్న పసిఫిక్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా, కారాబ్లాక్ జోడీ గెలుచుకుంది. స్పెయిన్ ప్రత్యర్థులు గార్భైన్ ముగుర్జా, కార్లా సువారెజ్ నవర్రో జోడీని 6-2, 7-5 తేడాతో ఓడించింది. 
 
టైటిల్ గెలుపొందినందుకుగానూ సానియా జోడీకి పది లక్షల డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న కొద్ది రోజులకే సానియా మరో టైటిల్ గెలుచుకోవడం విశేషం.