శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (20:04 IST)

రోజర్ ఫెదరర్ జట్టులో ఉండటం ఎగ్జైట్‌గా ఉంది : సానియా మీర్జా

ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌ టోర్నీలో స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టులో తాను ఉండటం ఎంతో ఎగ్జైట్‌కు గురవుతున్నట్టు హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా వెల్లడించారు. 
 
తాజాగా డబ్ల్యూటిఏ టైటిల్ గెలుచుకుని దూకుడు మీదున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వచ్చే నెలలో ఐపీటీఎల్ టోర్నీలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఇందులో స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టులో సానియా కూడా ఉంది. 
 
దీనిపై సానియా మీర్జా స్పందిస్తూ గొప్ప టెన్నిస్ క్రీడాకారుడితో కలిసి ఆడబోతుండటం చాలా సంతోషంగా ఉంది. ఫెదరర్ ఉన్న జట్టులో నేనుండటం పర్సనల్‌గా చాలా ఎగ్జైట్ అవుతున్నా. దానికోసం ఎదురుచూస్తున్నా. ఐపీటీఎల్ చాలా గొప్ప ఫార్మాట్. ఇది విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.