శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (18:21 IST)

సరితాదేవిపై ఏడాది నిషేధం: వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా

భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది. నిషేధంతో పాటు సరితా దేవిపై ఏఐబీఏ వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా కూడా విధించింది. ఆసియా క్రీడల్లో ఆమె పతకం నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించిన సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. 
 
అక్టోబర్‌లో దక్షిణకొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల బాక్సింగ్ సెమీ ఫైనల్ వివాదాస్పదమైంది. ఇందులో సరితా ప్రత్యర్థి కొరియా బాక్సర్ పార్క్ విజేతగా నిలిచింది. 
 
దాంతో, తీవ్ర నిరాశచెందిన సరితా బహుమతి కార్యక్రమ సమయంలో తన కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించి తీవ్రంగా రోదించింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాక్సింగ్ సమాఖ్య చర్యలు తీసుకుంది. వచ్చే ఏడాది నవంబర్ లో సరితా తిరిగి అర్హత పొందనుంది.