గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (12:20 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ నుంచి వీనస్ విలియమ్స్ నిష్క్రమణ!

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్ నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాడిసన్ కిస్ చేతిలో వీనస్ ఓటమి పాలైంది.
 
3-6, 6-4, 4-6 స్కోరు తేడాతో కిస్ చేతిలో ఓటమి చవిచూసిన వీనస్ టోర్నీ నుంచి వైదొలగింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో పాటు మహిళల సింగిల్స్‌లో అజరెంకా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఏడాది కొత్త తరం చాంపియన్లు అవతరించే అవకాశాలున్నాయి.