శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (11:26 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్: ఫైనల్లోకి దూసుకెళ్లిన షరపోవా!

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తన సత్తా ఏంటో నిరూపించుకుంది.  మహిళల సింగిల్స్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన సెమీ ఫైనల్‌లో ఈ అందాల సుందరి, మకరోవాపై విజయం సాధించి.. ఫైనల్లోకి ప్రవేశించింది.
 
సెమీఫైనల్లో 6-3, 6-2 స్కోరుతో వరుస సెట్లలో సునాయంగా మకరోవాను మట్టికరిపించిన షరపోవా, టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే పలుమార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన షరపోవా, టైటిల్ చేజిక్కించుకున్న దాఖలా లేదు. అయితే ఈసారైనా టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.