శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జులై 2015 (14:25 IST)

ప్రొ కబడ్డీ లీగ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్: కబడ్డీ జట్టును కూడా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ప్రొ కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే పలు వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న అల్లు అర్జున్.. కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తారని లీగ్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మరో ఆసక్తికర అంశాన్ని ప్రకటించాడు. ప్రొ కబడ్డీలో ఓ జట్టును కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. 
 
ఈ కబడ్డీ లీగ్‌కు మరో అంశం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందని అల్లు అర్జున్ అన్నాడు. కబడ్డీ భారతీయ క్రీడ కావడంతో దేశ క్రీడలను ప్రోత్సహించినట్లవుతుందనే ఉద్దేశంతో అంబాసిడర్‌గా సంతకం చేసేశానని చెప్పాడు. అంతేగాకుండా కబడ్డీ లీగ్ తొలిరోజైన ఆగస్టు 4వ తేదీ తాను జాతీయ గీతాన్ని ఆలపించనుండటం ఎంతో గర్వంగా ఉందని అల్లు అర్జున్ వెల్లడించాడు. 
 
స్టార్ స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ కన్నడ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్, హిందీ వంటి ఐదు భాషల్లో ప్రసారం కానుంది. ప్రస్తుతం మా టీవీ ద్వారా కబడ్డీ లీగ్‌ను ప్రసారం చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుందని అల్లు అర్జున్ తెలిపాడు. తప్పకుండా కబడ్డీకి మంచి ప్రాచుర్యం లభిస్తుందని ఇండియన్ గేమ్ కబడ్డీ స్టార్ స్పోర్ట్స్ ద్వారా వంద దేశాల్లో ప్రసారం కానుందని, వీటిలో అమెరికా, యూకే, మిడిల్ ఈస్ట్ అండ్ లాటిన్ అమెరికా కూడా ఉన్నాయన్నారు.