శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (11:08 IST)

సెల్ఫీ కోసం అభిమాని సాహసం: ఆందోళనకు గురైన ఫెదరర్!

సెల్ఫీ మోజు రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్‌తో సెల్ఫీ తీసుకోవాలనుకున్న అభిమానం సాహసం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ పోటీల ప్రారంభం రోజునే భద్రతా పరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో సెల్ఫీ దిగాలన్న అత్యుత్సాహంతో ఓ అభిమాని రక్షణ వలయాలను తప్పించుకుని మైదానంలోకి దూసుకొచ్చాడు.
 
భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు. మైదానంలోకి దూసుకొచ్చిన ఆ అభిమాని, ఫెదరర్ తో కలిసి నడుస్తూ, సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. దీంతో ఫెదరర్ సైతం కాస్తంత ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని దూరంగా తీసుకువెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.