శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (18:50 IST)

టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్య

దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా ఈ వెండి పతకాన్ని సాధించింది.
 
1:59:19 సెకన్లలో గమ్యస్థానాన్ని చేరుతుని ఈ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి సుష్మా దేవి నాల్గవ స్దానంలో నిలిచింది.
ఆమె 2:01:92 సెకన్లలో గమ్యస్థానాన్ని చేరుకుంది. మహిళల జావిలిన్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. 
 
జావిలిన్ త్రోలో అన్ను రాణి సాధించిన ఈ మెడల్‌తో భారత్‌కు పతకాల పట్టికలో 50 మెడల్ వచ్చి చేరింది. దీంతో దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకలా పట్టికలో 7 బంగారు, 9 వెండి, 34 కాంస్య పతకాలు సాధించింది.