విజేందర్‌కు చైనా జుల్ఫికర్ ప్రతి సవాల్.. ఇంటికొస్తాడట.. బెల్టులు తీసుకెళ్తాడట!?

బుధవారం, 2 ఆగస్టు 2017 (12:58 IST)

భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా పోరు జరుగనుంది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చైనా ఆటగాడు జుల్ఫికర్‌తో ఆగస్టు ఐదో తేదీన తలపడనున్నాడు. ఈ పోరాటం ఇరు దేశ ప్రజల మధ్య ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా ఈ పోరాటానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ "బ్యాటిల్ గ్రౌండ్ ఆసియా" అనే పేరు కూడా పెట్టింది. 
 
ఈ నేపథ్యంలో చైనా ప్రొడక్ట్ వ్యాఖ్యలపై విజేందర్ చేసిన వ్యాఖ్యలకు జుల్ఫికర్ సమాధానమిచ్చాడు. మొన్నటికి మొన్న తన కోసం ప్రార్థించాలంటూ.. చైనా ప్రత్యర్థి జుల్ఫికర్‌ను 45 సెకన్లలో నాకౌట్ చేసేందుకు ప్రయత్నిస్తానని కామెంట్ చేశాడు. ఇంకా అతడిని రెచ్చగొట్టే విధంగా చైనా ఉత్పత్తులు ఎక్కువకాలం మన్నికగా వుండవని ఎద్దేవా చేశాడు. 
 
ఈ వ్యాఖ్యలపై జుల్ఫికర్ మాట్లాడుతూ.. విజేందర్‌కు ప్రతి సవాల్ విసిరాడు. బాక్సింగ్ కోర్టులో సత్తా ఏంటో నిరూపిస్తానన్నాడు. విజేందర్‌కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని.. ఆగస్టు 5న విజేందర్ ఇంటికొస్తా.. తన బెల్టుతో పాటు అతని బెల్టు కూడా తీసుకెళ్తానని సవాల్ విసిరాడు.దీనిపై మరింత చదవండి :  
Vijender China Maimaitiali Indulge Chinese Products Zulpikar Maimaitiali Beijing Olympics

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ ఆపుకోలేకపోయాడు... ఏం చేశాడో తెలుసా?

క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ...

news

డోప్ పరీక్షలో పట్టుబడిన భారతీయ అథ్లెట్ ... స్వర్ణం వెనుకకు?

భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీంతో భువనేశ్వర్ వేదికగా ...

news

చరిత్ర సృష్టించిన ఫెదరర్... ఖాతాలో 19 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్

స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డెన్ ...

news

ఆ జాబితాలో ప్రభాస్‌కు ఆరో స్థానం.. పీవీ సింధుకు అగ్రస్థానం...

భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ ...