గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (18:41 IST)

సానియా కంటతడి: బీజేపీ ఓవర్.. ఇక వీహెచ్‌పీ తంతు!!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ సర్కార్ అంబాసిడర్‌గా ప్రకటించడాన్ని బీజేపీ తప్పు పట్టింది. తాజాగా వీహెచ్‌పీ నేతలు కూడా అదే బాట పట్టారు. సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడాన్ని వీహెచ్‌పీ నేతలు కేశవరాజు, సురేందర్‌రెడ్డి ఖండించారు. 52 రోజుల కేసీఆర్ పాలనలో కేవలం ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేయడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అనే తెలంగాణ బాలికకు కేవలం 25 లక్షలు మాత్రమే ఇచ్చి, సానియా మీర్జాకు మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం ఏంటని వీహెచ్‌పీ ప్రశ్నిస్తోంది.
 
1956 తర్వాత తెలంగాణకు వచ్చిన వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని ప్రభుత్వానికి.. సానియాకు ఇవ్వడానికి కోటి రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని లక్ష్మణ్ నిలదీశారు. ఆమె ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, బతుకమ్మ ఆడలేదని గుర్తుచేశారు.
 
అయితే తెలంగాణ అంబాసిడర్‌గా ఎంపికవడం పట్ల సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తడంతో సానియా కంటతడిపెట్టింది. స్థానికత దుమారం రేగడం దురదృష్టకరమంది.