శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జులై 2018 (08:43 IST)

క్రొయేషియాకు ఫ్రెంచ్ కిక్... ఫిఫా ప్రపంచ కప్ విశ్వవిజేతగా ఫ్రాన్స్..

మాస్కో నగరంలోని లుజ్నికి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియాను ఓడించిన ఫ్రాన్స్ జట్టు ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచింది. 1998లో తొలిసారి విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జ

మాస్కో నగరంలోని లుజ్నికి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియాను ఓడించిన ఫ్రాన్స్ జట్టు ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచింది. 1998లో తొలిసారి విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు..2006 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. తాజాగా క్రొయేషియాపై ఘనవిజయంతో రెండోసారి చాంపియన్‌షిప్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది.
 
ఫ్రాన్స్ జట్టులో ఆట 38వ నిమిషంలో లభించిన పెనాల్టీని గ్రీజ్‌మన్ గోల్‌గా కొట్టగా, 59వ నిమిషంలో పాల్‌పోగ్బా, 65వ నిమిషంలో ఎంబాప్పే గోల్స్ సాధించారు. ఆట 18వ నిమిషంలో క్రొయేషియా ఫార్వర్డ్ సెల్ఫ్‌గోల్‌తో కలుపుకుని ఫ్రాన్స్ జట్టు 4గోల్స్ కొట్టింది. క్రొయేషియా జట్టులో పెరిసిచ్ 28వ నిమిషంలో, మాంజికిచ్ 69వ నిమిషంలో గోల్స్ కొట్టారు. 
 
మ్యాచ్ ఆద్యంతం క్రొయేషియా పోరాటాన్ని నిలువరించిన ఫ్రెంచ్ జట్టు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మురిసింది. ఫ్రాన్స్ జట్టు విశ్వవిజేతగా నిలవడంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ ఆనందంతో నాట్యం చేయగా.. పారిస్‌లోని ఈఫిల్‌టవర్ ముందు లక్షలాది ఫ్యాన్స్ సంబురాలతో హొరెత్తించారు. 
 
క్రొయేషియాను ఫైనల్ చేర్చిన హీరోలే ఈ మ్యాచ్‌లో విలన్లుగా మారారు. ఫలితంగా సెల్ఫ్‌గోల్‌తో మాంజికిచ్, బంతిని చేతితో అడ్డుకుని పెరిసిచ్ చేసిన తప్పు ఫ్రాన్స్‌కు వరమైంది. దీంతో ఫ్రాన్స్ ఖాతాలో రెండుగోల్స్ నమోదు కావడంతో ఆ జట్టు చెలరేగింది.. క్రొయేషియా తరపున పెరిసిచ్, మాంజికిచ్ చెరో గోల్ కొట్టినా దూకుడుతో మెరిసిన ఫ్రాన్స్‌ను నిలువరించలేకపోయారు.
 
పోగ్బా, ఎంబాప్పే, గ్రీజ్‌మన్ గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను జగజ్జేతగా నిలిపారు. గ్రీజ్‌మన్ గోల్ కొట్టగా ఇంతవరకు ఓటమి ఎరుగని ఫ్రాన్స్ జట్టు రికార్డు నిలబెట్టుకోగా సంబురాలు మొదలయ్యాయి. ఫైనల్లో 4-2 గోల్స్ విజయంతో ఫిఫా ప్రపంచకప్ విజేతగా ఫ్రాన్స్ నిలవగా.. పోరాడి ఓడిన క్రొయేషియా సాకర్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.