బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:55 IST)

భారత మహిళా రెజ్లర్ గీతికా జఖార్‌పై హర్యానాలో దాడి!

భారత మహిళా రెజ్లర్ గీతికా జఖార్ హర్యానా రాష్ట్రంలోని హిసార్‌లో దాడి చేశారు. ఆమె తోటి రెజ్లర్లతో కలిసి ప్రాక్టీసు చేస్తుండగా, సునీల్ అనే వ్యక్తి దాడి చేసినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల 63 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో గీతిక రజతం గెలుచుకున్న విషయం తెల్సిందే. 
 
ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయసాగాడు. అలా వ్యాఖ్యానించడం సరికాదంటూ గీతిక చెప్పడంతో అతను దాడికి దిగాడు. అంతేగాకుండా, చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి సునీల్ పరారయ్యాడు. గీతిక నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు.