Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీరామనవమి : కంచు దీపముతో దీపారాధన చేయండి

Widgets Magazine

FILE
నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూండింటికీ పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం మూడూ కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి.

సృష్టి దానిలోని జీవకోటి రాజస, సాత్త్విక, తామస గుణాలతో కూడినవి, ప్రమిదలో వత్తిలాంటి సత్త్వగుణము. నూనెలాంటిది తమోగుణం. మంటలాంటిది రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు.

కాని మూడు కలిస్తే కాంతి నిండుతుంది. మంచిమనిషిగా ఉండాలనుకున్న వారు రజస్, తమోగుణాలని అణచివేసి సత్త్వగుణం ఎక్కువగా అలవరుచుకోవాలి. అప్పుడా వ్యక్తి జీవితం కాంతిమయమవుతుంది. రాగద్వేషాల్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది.

అందుచేత శ్రీరామనవమి రోజున కొబ్బరినూనెను ఉపయోగించి కంచు దీపముతో దీపారాధన చేయడమే గాకుండా ఇంటి ముందర వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. మరి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
శ్రీరామనవమి శ్రీరామనవమి కంచు దీపము శ్రీరామనవమి దీపారాధన

ఆధ్యాత్మికం వార్తలు

"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ...

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి...?

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మీ గతం ఎలాంటిదన్న దానితో సంబంధం లేకుండా మీరు మీ ముక్తి వైపు ...

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు. మీరు మీ అస్తిత్వపు నేపథ్యాన్నిఇలా అర్థం చేసుకుంటే, ...

శ్రీమంతులు కావాలంటే.. శివలింగాన్ని పూజించండి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ...

Widgets Magazine