Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కృష్ణాష్టమి: భక్తులతో పోటెత్తిన శ్రీవారి ఆలయం

Widgets Magazine

Venkateswara
FILE
కృష్ణాష్టమి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమలేశుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవులతో పాటు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనం కోసం వేచివుండే కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

దీంతో స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నేడు ఆలయంలో జరిగే గోకులాష్టమి ఆస్థానం, ఉట్లోత్సవం సందర్భంగా ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా వెంకన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో తితిదే అధికారులు మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమలలో పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. నేటి నుంచి మూడు రోజులు సెలవులు కావడంతో తితిదే అప్రమత్తమైంది. లడ్డూల కొరత రానివ్వకుండా తితిదే యంత్రాంగం తగినన్ని నిల్వచేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ఆధ్యాత్మికం వార్తలు

"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ...

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి...?

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మీ గతం ఎలాంటిదన్న దానితో సంబంధం లేకుండా మీరు మీ ముక్తి వైపు ...

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు. మీరు మీ అస్తిత్వపు నేపథ్యాన్నిఇలా అర్థం చేసుకుంటే, ...

శ్రీమంతులు కావాలంటే.. శివలింగాన్ని పూజించండి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ...

Widgets Magazine