Widgets Magazine

ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు

Gulzar Ghouse|
FILE
శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామునుంచే దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

శ్రీ కష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు వైష్ణవాలయాల్లో, శ్రీ కృష్ణ మందిరాలలో విశేష పూజలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, గుజరాత్‌లోని ద్వారక, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలలోని ఇస్కాన్ ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి, పూజలు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుండగా తిరుమలలో స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో నైవేద్యం పెట్టి, హారతులిచ్చి పూజలు చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.
కాగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను పలు ఆలయాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.


దీనిపై మరింత చదవండి :