బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By CVR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (18:11 IST)

బంగాళదుంప స్వీట్ హల్వా

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు: 10 (ఉడికించి పెట్టుకోవాలి)
చక్కెర : 1/4 కప్ 
బాదం : పప్పులు (సరిపడేంత) 
పిస్తా : పిస్తా (2 లేదా 3 ముక్కలుగా చేసుకోవాలి) 
నెయ్యి: 3 టేబుల్ స్పూన్స్
 
తయారుచేయండి ఇలా : మొదటగా బంగాళదుంపలను నీటిలో ఉడికించి, తర్వాత పొక్కు తీసి మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనుమును స్టౌ మీద ఉంచి, అందులో కొంచెం నెయ్యి పోసి వేడి చేయాలి. అలా వేడి చేసిన నెయ్యిలో మెత్తగా చిదిమిన బంగాళదుంపలను వేసి బాగా మిక్స్ చేయాలి. అలా ప్రతి నిముషానికోసారి పెనుముకు అంటుకోకుండా మిక్స్ చేస్తూ వుండాలి. అలా చేసిన తరువాత పంచదారను వేసి దానిని కూడా పూర్తిగా కరిగేవరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న హల్వాను స్టౌ నుంచి కిందకు దించి, దానిపై బాదం, పిస్తాలు పప్పులు వేసుకోవాలి. అంతే శక్తివంతమైన, రుచికరమైన హల్వా రెడీ.