శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 జులై 2014 (16:58 IST)

రంజాన్ స్పెషల్ : ఖర్జూరంతో నోరూరించే హల్వా!

రంజాన్ వచ్చేస్తోంది. ఈ నెలలో ముస్లీంలు ఇష్టపడే తినే ఖర్జూరంతో హల్వా చేయడం ఎలాగో చూద్దాం. ఉపవాసాల సమయంలో ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రంజాన్ నెలలో ఖర్జూరంతో లేదా నీటితో ఉపవాసం విరమించటం మహమ్మద్ దినచర్యగా ఉండేది, అదే అనవాయితీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు అనుసరిస్తున్నారు.
 
ఖర్జూరాలు మంచి పోషక విలువలు కలవి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటంతో తక్షణ ఎనర్జీని అందిస్తుంది. తక్షణ శక్తినిచ్చే ఈ ఖర్జూరాలతో తయారుచేసే హల్వాకు కూడా క్రేజ్ ఎక్కువే. మరి ఈ టేస్టీ అండ్ స్వీట్ డేట్స్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం... 
 
కావలసిన పదార్ధాలు:
ఖర్జూరం: పావు కేజీ
పాలు: 3 కప్పులు  
పంచదార: పావు కేజీ
బాదంపలుకులు: అర కప్పు
జీడిపప్పు: పావు కప్పు
కిస్‌మిస్‌లు: పావు కప్పు 
యాలకుల పొడి : ఒక టేబుల్ స్పూన్  
నెయ్యి: 3 టీ స్పూన్లు 
 
తయారీ విధానం : 
ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఖర్జూరాల్లో గింజలను తొలగించి పాలలో వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. తర్వాత ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి జోడించి మూత పెట్టాలి. ఈ మిశ్రమం అడగంటకుండా గరిటతో కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసుకోవాలి.  తరువాత నేతిలో వేయించిన బాదం, కిస్‌మిస్‌లను వేసుకుని దింపుకోవాలి. అంతే.. ఖర్జూర స్వీట్‌ హాల్వా రెడీ.