మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (18:26 IST)

మినీ స్నాక్స్: అటుకుల లడ్డూ ఎలా చేయాలి?

పిల్లలు స్నాక్స్ చేసిపెట్టమని అడుగుతున్నారా? ఈజీగా చేసే స్నాక్స్ ట్రై చేయాలనుకుంటే వెంటనే ఆలోచించకుండా అటుకుల లడ్డూలు చేసేయండి. ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు : 
పల్లీలు, అటుకులు - గ్లాసు చొప్పున 
నెయ్యి - పావు కప్పు 
బెల్లం తరుగు - గ్లాసు
యాలకుల పొడి - చెంచా. 
 
తయారీ విధానం ముందుగా పల్లీలను నూనె లేకుండా బాణలిలో వేయించుకుని తర్వాత పొట్టుతీసుకుని పక్కనబెట్టుకోవాలి. అదే బాణలిలో అరచెంచా నెయ్యి కరిగించి అటుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలను మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి.
 
తర్వాత అందులో అటుకులు కూడా వేసుకుని మిక్సీ పట్టాలి. ఆ పొడిలో బెల్లం, యాలకుల పొడి కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ ముద్దలా అయ్యేలా మళ్లీ మిక్సీ పట్టాలి. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే ఇందులో డ్రైఫ్రూట్స్ కూడా చేర్చుకోవచ్చు.