గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (18:18 IST)

నవరాత్రి స్పెషల్ : బాదం హల్వా ఎలా చేయాలి?

నవరాత్రి స్పెషల్ బాదం హల్వా తయారు చేయండి. అమ్మవారి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి.. అమ్మలగన్న అమ్మ అనుగ్రహం పొందండి. ఇంతకీ బాదం హల్వా ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు: 
బాదం: రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ ఒక కప్పు 
పంచదార: రుచికి తగినంత
పాలు: ఒక కప్పు 
నెయ్యి: అర కప్పు
నానబెట్టిన కుంకుమ పువ్వు కాసింత 
 
తయారీ విధానం: 
ముందుగా డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పాన్ మొత్తం స్పెడ్ చేయాలి. అలా చేస్తే హల్వా పాన్‌కు అంటుకోదు. తర్వాత అదే పాన్‌లో ముప్పావు శాతం నీరు పోసి మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి, కరిగే వరకూ కలియబెట్టాలి.
 
అందులో బాదం పేస్ట్, మిగిలిన పాలు, కుంకుమపువ్వు కూడా వేసి మీడియం మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమాన్ని అడుగు అంటకుండా కలుపుతూ వుండాలి. ఇలా ఈ మిశ్రమం ఉడుకుతూ చిన్నబడ్డాక మిగిలిన నెయ్యి కూడా పోసి మరో 10 నిముషాలు ఉడికించాలి.   
 
నెయ్యి పూర్తిగా హల్వా గ్రహిస్తుంది తర్వాత పాన్ చివర్లకూడా అంటుకోకుండా చేస్తుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత కూడా మరికొద్దిగా నెయ్యి వేయడం వల్ల బాదం హల్వా చాలా సాఫ్ట్‌గా మారుతుంది. ఈ హల్వాను మీకు నచ్చిన షేఫ్‌లో కట్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.