శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:33 IST)

దీపావళి స్పెషల్: తియ్యటి కొవ్వొత్తులు

కావలసిన పదార్థాలు : 
పాలు  - రెండు కప్పులు
పంచదార - రెండు కప్పులు
మొక్క జొన్న పిండి, వరిపిండి, మైదా కలిసి - అరకప్పు
జీడిపప్పు ముద్ద - పావు కప్పు
నెయ్యి - అరకప్పు
యాలకుల పొడి - ఒక స్పూన్
మిఠాయి రంగులు - రెండు మూడు
 
తయారు చేయండి ఇలా: మొదట పొయ్యి మీద పాన్ పెట్టుకుని పచ్చిపాలు పోసి, పంచదార కలిపి, అందులో మైదా పిండి, వరి పిండి, మొక్కజొన్న పిండిని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే సన్నని సెగ మీద ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి. మరో వైపు జీడిపప్పులను కొంచెం నీళ్లు చేర్చి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ముద్దంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌పై ఉన్న మిశ్రం దగ్గరపడుతుండగా జీడిపప్పు ముద్దను చేర్చాలి. యాలకులపొడి కూడా చల్లి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని భాగాలుగా చేసి, మనకు కావల్సిన రంగులు కలిపి. చల్లారాక కొవ్వొత్తుల ఆకారంలో చేసుకోవాలి. వాటిపై పైన అదే మిశ్రమాన్ని వొత్తుల్లా చేసుకుంటే చాలు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొవ్వొత్తులు సిద్దం. తీయ్యటి ఈ కొవ్వొత్తులు అందరినీ ఆకట్టుకుంటాయి.