Widgets Magazine

తెలంగాణను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:42 IST)

Widgets Magazine
swine flu

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇందులో 13మందికి హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యుల పరీక్షల్లో తేలింది. 85 మంది రోగులను పరీక్షించగా వారిలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు తెలిపారు. 
 
గత ఏడాది 3,696 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని వెల్లడైంది. ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల లక్షణాలుంటే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్యులు కోరారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకే స్వైన్ ప్లూ సోకింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇది అంటు వ్యాధి కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌లో ఈ నెలలో స్వైన్ ప్లూతో ఐదుగురు మరణించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తాహశీల్దారు... ఎక్కడ?

విశాఖపట్టణం రూరల్ తాహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి ...

news

ఇష్టం లేని పెళ్లి.. పదినెలల పాటు కాపురం చేసింది... ఆపై ఉరేసుకుని ఆత్మహత్య

ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ...

news

ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో ఎన్నెన్ని ప్రత్యేకతలో.. మైకు విరగ్గొట్టలేరు... పోడియం ఎక్కలేరు

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ, ...

news

లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలా? ఎందుకు : టీటీడీపీ నేతలతో చంద్రబాబు

తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు ...