గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2016 (18:57 IST)

హైదరాబాదులో 28,000 భవనాలు కూల్చేస్తాం... పాజిటివ్‌గా రాయండి.... మీడియాతో తెలంగాణ సీఎం కేసీఆర్

హైదరాబాదులో ఈ వరద నీళ్ల దరిద్రానికి కారణం గత ప్రభుత్వాలే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వరద నీళ్లు వెళ్లాల్సిన నాలాల మీద 28 వేల కట్టడాలు ఉన్నాయనీ, వాటన్నిటినీ కూలగొడితేనే హైదరాబాదుకు ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. వీటిని కూల్చేటప్పుడు పత్రికలన్నీ

హైదరాబాదులో ఈ వరద నీళ్ల దరిద్రానికి కారణం గత ప్రభుత్వాలే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వరద నీళ్లు వెళ్లాల్సిన నాలాల మీద 28 వేల కట్టడాలు ఉన్నాయనీ, వాటన్నిటినీ కూలగొడితేనే హైదరాబాదుకు ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. వీటిని కూల్చేటప్పుడు పత్రికలన్నీ పాజిటివ్‌గా రాయాలని కోరారు. వరదలపై సమీక్ష గురించి ఆయన మాట్లాడుతూ... " 448 శాతం ఎక్కువ వర్షపాతం పడింది. ఐతే ఈ వానల్లో మనిషే కాదు ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఏదో హైదరాబాద్ నగరం మునిగిపోయిందని రాయొద్దు. హైదరాబాద్ బ్రాండను దెబ్బ తీయవద్దు.
 
మేజర్ చెరువు కట్టడాలు బలంగానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు పాత భవనాలను కూల్చేశారు. అందుకే ప్రాణ నష్టం తప్పింది. చెన్నై వరదలతో పోలిస్తే హైదరాబాదుకు జరిగిన నష్టం తక్కువ. తెలంగాణ ప్రాజెక్టులన్నీ జలకళతో నిండుకుండలా ఉన్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలు కనబడుతున్నాయి. 
 
హైదరాబాద్ నగరంలో మాత్రం ఎక్కువ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారు. అందువల్లనే నష్టం వాటిల్లలేదు" అని చెప్పారు.