శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (12:51 IST)

సండ్ర అరెస్టు సక్రమమా? అక్రమమా? .. మరో గంటలో తేలుస్తా... టీ ఏసీబీ కోర్టు

ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను నాలుగో నిందితుడిగా అరెస్టు చేయడం సక్రమమా, అక్రమమా అనేది మరో గంటలో తేలుస్తానని టీ ఏసీబీ కోర్టు స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో సండ్ర వద్ద సోమవారం ఏడు గంటల పాటు విచారించిన ఏసీబీ కోర్టు.. సాయంత్రం సమయంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆయనను మంగళవారం ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ క్రమంలో సండ్ర అరెస్టుపై ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. సండ్ర అరెస్టు అక్రమమని ఆయన తరపు న్యాయవాది వాదించారు. మొదట సీఆర్ పీసీ 160 కింద కేసు పెట్టారని, ఆ తర్వాత 41ఏ కింద నోటీసులిచ్చి అరెస్టు చేశారని తెలిపారు. పైగా సండ్ర వెంకటవీరయ్య అరెస్టుకు సంబంధించి శాసనసభ స్పీకర్‌కు కాని, ఎన్నికల సంఘానికి కాని మాటమాత్రం కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. 
 
దీనికి కౌంటర్‌గా ఏసీబీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో ఉన్నప్పుడు సండ్ర రాజమండ్రికి వెళ్లారన్నారు. అందువల్ల సండ్ర అరెస్ట్ సక్రమమే అని వాదించారు. ఈ క్రమంలో, ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు... మరో గంటలో సండ్ర అరెస్ట్ సక్రమమా? కాదా? అన్న విషయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.