శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (16:18 IST)

విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ఆటో డ్రైవర్‌కు చితక్కొట్టుడు

ఆటోలో ఎక్కిన విద్యార్థినిని లైంగికంగా వేధించినందుకు ఓ ఆటో డ్రైవర్‌ను చితక్కొట్టారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తుంగతుర్తి మండలం పస్తాల గ్రామానికి చెందిన శైలజ అనే విద్యార్థిని సూర్యాపేటలో ఉంటూ దురాజ్‌పల్లి వద్ద ఉన్న కాలేజీలో పీఈటీ కోర్స్ చేస్తోంది. ఈమె శనివారం కాలేజీకి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. సూర్యాపేట శివారులో ఆటోలో ఉన్న మరో మహిళ దిగిపోవడంతో డ్రైవర్ శైలజ ఒక్కటే ఆటోలో మిగిలిపోయింది. 
 
ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్‌ను శైలజను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలు భయంతో ఆటోలో నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆటో వెంటపడి డ్రైవర్‌ను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. గాయపడిన శైలజను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.