శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

వేసవి కాలం వస్తోంది.. ఎండలు మండిపోతాయ్... బీరు ఉత్పత్తి పెంచండి : అబ్కారీ శాఖ

హైదరాబాద్ నగరంలో అపుడే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పగటి పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర అబ్కారీ (ఎక్సైజ్) శాఖ అప్రమత్తమైంది. వేసవి కాలంలో బీరు ఉత్పత్తి ఒక్కసీసా కూడా తగ్గడానికి వీలులేదనీ, వీలుంటే అధికంగానే ఉత్పత్తి చేయాలంటూ బ్రూవరీల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌, తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌వీ చంద్రవదన బీరు ఉత్పత్తి చేసే బ్రూవరీల యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తెలంగాణ చరిత్రలోనే ఎక్కువ ఎండలు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల బీరు అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల బీరు ఉత్పత్తి ఏమాత్రం తగ్గకుండా, అదనంగా ఉత్పత్తి చేయాలంటూ ఆయన కోరారు.