శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (11:45 IST)

హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ... లక్షలాది కోళ్ళు మృత్యువాత!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌‌ను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షలాది కోళ్లు మృత్యువతపడ్డాయి. ఇప్పటికే అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ నగరాన్ని బర్డ్ ఫ్లూ వైరస్‌తో బస్తీ వాసులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చూసింది. వైరస్ ఉన్నట్లు పూణెలోని వైద్య నిపుణులు నిర్థారించటంతో చికెన్ కొనుగోలు చేసేందుకు నగరవాసులు జంకుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను నిర్థారించటంతో పాటు త్వరలోనే పూణె నుంచి రానున్న ప్రత్యేక వైద్యుల బృందం వైరస్ వెలుగుచూసిన హయత్‌నగర్‌కు చుట్టూ కిలోమీటరు పరిధిలోని అన్ని కోళ్ల పరిశ్రమలను సందర్శించి, కోళ్లకు తగిన పరీక్షలు చేయనున్నారు. 
 
బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా, లేకపోయినా ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం హయత్‌నగర్‌కు కిలోమీటరు పరిధిలోనున్న అన్ని కోళ్ల పరిశ్రమలోని కోళ్లను పూడ్చివేయాలని సూచించటంతో ఆరోగ్యపరంగా ప్రజలు, వ్యాపార పరంగా చికెన్ హోల్‌సెల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.