మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (08:46 IST)

టీ ఎమ్మెల్సీ ఎన్నికలు : రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి!

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయనపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద రావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడం గమనార్హం. 
 
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకు నీటిపారుదల శాఖలో తను చేస్తున్న ఉద్యోగానికి దేవీ ప్రసాద్ రాజీనామా చేసి మరీ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆయనకు పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఈ ఓటమి దేవీ ప్రసాదరావు కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ.