Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముఖ్యమంత్రి పి.ఏనంటూ బుగ్గ కారుతో హల్చల్... బోగస్ గన్ మేన్

గురువారం, 10 మే 2018 (22:17 IST)

Widgets Magazine

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడినని నంటూ  పలువురిని నమ్మించి పోలీసులకు చిక్కాడు నేరస్థుడు. సచివాలయంలో తనకున్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.70 లక్షల్ని వసూలు చేశాడు.  ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు  దర్యాప్తు చేయడంతో అతడి బండారం బయటపడింది.
వరంగల్‌ మండీబజార్‌కు చెందిన మహ్మద్‌ ఖిఫాయత్‌ అలీ(29) ప్రైవేటు ఉద్యోగి. తెలంగాణ సీఎం సలహాదారుకు వ్యక్తిగత సహాయకుడినంటూ తన ఇంటి ముందు బోర్డు తగిలించుకున్నాడు. 
crime photo
 
తన కారుకు ఎర్రబుగ్గ తగిలించుకొని స్థానికంగా హడావుడి చేసేవాడు. ఇఫ్తార్‌ విందుల పేరిట ప్రముఖుల్ని పిలిచి హంగామా చేసేవాడు. తన మిత్రుడుకు సఫారీ సూట్ వేసి గన్ మేన్ లా నటించమనేవాబు.  ఖిఫాయత్‌ అలీ హడావుడి చూసి అతడు నిజంగానే సచివాలయ ఉద్యోగి అని స్థానికులు నమ్మారు. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ వరంగల్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నంద్యాలకు చెందిన ఇరవై మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశాడు. బాధితులెవరైనా గట్టిగా అడిగితే వారిని సచివాలయం వద్దకు రప్పించేవాడు. త్వరలోనే నియామక ఉత్తర్వులు ఇస్తారంటూ నమ్మించి పంపించేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను  ఆశ్రయిండంతో  దొరికిపోయాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికే ఇళ్లు... ఎలా గుర్తించడం?

అమరావతి: అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయం ...

news

మైనింగ్ కేసుకి రూ. 160 కోట్ల లంచం... శ్రీరాములు భాజపాను అడ్డంగా బుక్ చేసేశాడా

గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడిగా పేరున్న శ్రీరాములుకి సంబంధించి ఓ వీడియో టేప్ ఇప్పుడు ...

news

కర్ణాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో లగడపాటి చెప్పిన సర్వే చూస్తే షాకే..

ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు బిజెపి, మరోవైపు ...

news

మంత్రులు అందుకు రెడీ.. కానీ మోదీ, అమిత్ షా అడ్డుపడుతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్యాకేజీల విషయంలో రోజుకో మాట మాట్లాడటంతో ...

Widgets Magazine