శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (03:37 IST)

చదివింది 8వ క్లాస్, 15మంది మగ పిల్లలపై అత్యాచారం.. ఇప్పుడు హత్య కూడా.. వీడు మనిషేనా?

ఎనిమిదో తరగతివరకు చదివిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు పొరుగున ఉన్న పదేళ్ల అబ్బాయిపై అసహజమైన లైంగిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా నొప్పిగా ఉంది, నాన్నకు చెబుతా అంటూ బాధను వ్యక్తం చేసిన ఆ పసిబాలుడిని రాడ్లతో కొట్టి చంపి శవాన్ని మాయం చేసే క్రమంలో దొరికిప

ఎనిమిదో తరగతివరకు చదివిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు పొరుగున ఉన్న పదేళ్ల అబ్బాయిపై అసహజమైన లైంగిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా నొప్పిగా ఉంది, నాన్నకు చెబుతా అంటూ బాధను వ్యక్తం చేసిన ఆ పసిబాలుడిని రాడ్లతో కొట్టి చంపి శవాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోయాడు. తల్లితండ్రులు 20 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తుండటంతో వారు ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసేందుకు బానిసలవుతున్నారని, దీంతో మైనర్లు కూడా విచక్షణ కోల్పోయి ఘాతుకాలకు పాల్పడుతున్నారని  పోలీసులు చెబుతున్న కథనం వింటే వణుకు పుడుతోంది.

నేటితరం పిల్లలు మనుషులుగా పెరుగుతున్నారా లేక పశువుల కంటే హీనంగా తయారు చేయబడుతున్నారా? దీనికి తల్లిదండ్రులమీదే నెపం మోపితే సరిపోతుందా.? ఎలాంటి సమాజం మన కళ్లముందే తయారవుతోంది. తల్చుకుంటేనే భయమేస్తోంది. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిస్తే సీసీ కెమెరాల్లో ఫుటేజి ఆదారంగా అసలు విషయం బయటపడింది కానీ లేకపోతే ఈ విషయం వెలుగులోకి వచ్చేదే కాదు.
 
పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్‌ అసహజ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. విషయం బయటపడకూ డదని ఆ పసి మొగ్గను చిదిమేశాడు. మిస్సింగ్‌గా నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులకు సీసీ కెమెరాల్లో చిన్న ఆధారం దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. హత్య వెలుగులోకి వచ్చింది. బార్కాస్‌ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ జమీల్‌ ఖాన్‌ కుమారుడు మహ్మద్‌ ఖాన్‌(10) స్థానిక లయోలా పాఠ శాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రంజాన్‌ నేపథ్యంలో బార్కాస్‌ బజార్‌లో ఏర్పాటైన మేళా దగ్గర జూన్‌ 28న ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి ఖాన్‌ అదృశ్యం కావడంతో కుటుంబీకులు మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసుల విచారణలో తేలినదేమంటే.. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న ఖాన్‌కు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మైనర్‌.. అతడిని బార్కాస్‌ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల గ్రిల్స్‌ తొలిగించి భవనంపైకి చేరుకుని, అక్కడే చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు తనకు నొప్పిగా ఉందని, విషయం తండ్రికి చెపుతా ననటంతో మైనర్‌ తీవ్రంగా భయపడ్డాడు. జూలై 2న తన సోదరి వివాహం ఉండటంతో విషయం బయటకు వస్తే పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని భావించాడు. 
 
అఘాయిత్యం వెలుగులోకి రాకూడదంటే బాలుడిని హత్య చేయడమే మార్గ మని భావించాడు. అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో బాలుడిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని మాయం చేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులు కట్టేశాడు. మృతదేహాన్ని మరో చోటికి మార్చడానికి రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడుబడినట్లు ఉండే అక్కడికి ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్కాస్, చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. 
 
బడీ మసీదు ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ సాంకేతిక సమస్యతో ఓపెన్‌ కాలేదు. బుధవారం ఆ ఫీడ్‌ ఓపెన్‌ కావడంతో పరిశీలించారు. 28న మధ్యాహ్నం 1.28 గంటలకు ఖాన్‌ను ఓ యువకుడు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. బాలుడి తండ్రి ఆ యువ కుడు తన ఇంటి పక్కనే ఉండే మైనర్‌గా గుర్తించారు. ఎనిమిదో తరగతి వరకే చదివిన అతడు ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ చూపించడంతో నేరం అంగీకరించాడు. గురువారం ఉదయం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
 
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఇప్పటి వరకు 15 మందిపై ఇదే తరహాలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. వారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని మరికొన్ని కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 20 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తుండటంతో ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసేందుకు బానిసలవుతున్నారని, దీంతో మైనర్లు కూడా విచక్షణ కోల్పోయి ఘాతుకాలకు పాల్పడుతు న్నారని సౌత్‌జోన్‌ డీసీపీ వి.సత్యనారాయణ చెప్పారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.