శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PYR
Last Modified: శుక్రవారం, 30 జనవరి 2015 (07:10 IST)

యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్

యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుందని ఆయన అన్నారు.  తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గురువారం ఇన్సులిన్ తయారీ కేంద్రం శాంతాబయోటెక్స్ కంపెనీ ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి రూ.460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ట్లు వివరించారు. 
 
ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రస్తుత కనీసం 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయనీ, పూర్తిస్థాయిలో విస్తరణ జరిగితే మరో రెండువేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సనోఫి కంపెనీ ప్రాంక్‌ఫర్ట్ తర్వాత రెండవ ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ముప్పిరెడ్డిపల్లిలో ప్రారంభించనుండటం ఆనందంగా ఉందన్నారు. పలు కంపెనీలు ఇక్క ఏర్పాటు చేయడం వలన వజ్రాల తెలంగాణను ఏర్పాటు చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇలా పరిశ్రమలకు పెద్ద పీఠ వేయడం ద్వారా యువతకు సరియైన అవకాశాలు కల్పించిన వారిమవుతామని అన్నారు. ఎక్కడైతే యువత సరియైన మార్గంలో ఉపాధి రంగంలో నడుస్తుందో అక్కడ అభివృద్ధి దానంతట అదే పరుగులు పెడుతుందని కేసీఆర్ అన్నారు.