గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (16:23 IST)

కేసీఆర్ వైఖరి.. వినాశకాలే విపరీతబుద్ధిలా వుంది: జానారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ రాష్ట్ర విపక్ష నేత, మాజీ మంత్రి కె జానారెడ్డి ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ వైఖరి వినాశకాలే విపరీతబుద్ధి అన్న చందంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగానే ఆయన విపక్ష నేతలను సైతం హేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన పదవిని విడిచిపెట్టకుండా వేరే పార్టీలోకి చేరడం అనైతికమన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి కనకయ్య మీద అనర్హత వేటు వేయాలని కోరారు.