గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (11:16 IST)

కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి... కులుకు ఎందుకెళ్లారు?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణించారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. స్టాండింగ్ కమ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణించారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులుమనాలికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో కారు సీటులోనే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. కాగా.... ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
కాగా, 1967లో పాల్వాయి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007-09 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1936 నవంబర్ 19న మహబూబ్ నగర్ జిల్లా నడింపల్లిలో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాల్వాయి మరణవార్తతో వివిధ పార్టీలకు చెందిన నేతలు షాక్‌కు గురయ్యారు. పాల్వాయి మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. పలువురు నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.