బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (06:07 IST)

డిపోలు తెరుచుకోండి... ఉమ్మడి ఖాతాలో జమ చేయండి

హైదరాబాద్ ప్రాంతంలో మూతపడ్డ ఆరు మద్యం డిపోలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలును తెరుకోవచ్చునని, కానీ వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఈ మద్యం డిపోలు తెరుకోనున్నాయి. వివరాలివి.
 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పరిదిలోని కొన్ని మద్యం డిపోలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో మూడురోజుల క్రితం నుంచి మూసేశారు. ఈ ఆరుమద్యం డిపోలపై వారు హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై విచారణ జరిగిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలు తెరుచుకోవచ్చునని, అయితే వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. 
దీంతో గురువారం నుంచి ఈ డిపోలు తెరచుకోనున్నాయి. 
 
తదుపరి ఉత్తర్వులొచ్చేదాకా ఉమ్మడి ఖాతాలోని మొత్తాన్ని వినియోగించుకోకూడదని నిర్దేశించింది. సరుకు నిల్వల జాబితాను ఐటీ శాఖకు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.