మరలా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పనున్న డి.శ్రీనివాస్

d srinivas
శ్రీ| Last Modified శనివారం, 10 నవంబరు 2018 (16:50 IST)
డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్‌లో చక్రం తిప్పబోతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సోనియాతో డి.ఎస్ భేటీ కావడంతో మహాకూటమిలో పార్టీల మధ్య సమన్వయ బాధ్యతను సోనియా డి.ఎస్‌కు అప్పచెప్పారు. 
 
ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు మహాకూటమి విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఈ కారణంగానే డీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వై.ఎస్ హవా నడుస్తున్నా, డి.ఎస్ కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తనకంటూ ఓ ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు.
 
ఈ పరిచాయలతోనే డీఎస్ అనుభవాలను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి డి.ఎస్ వ్యూహాలు ఏమేరకు పార్టీకి లాభిస్తాయో వేచిచూడాలి.దీనిపై మరింత చదవండి :