శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (09:54 IST)

మేం చెప్తున్నాం.. ఆ 8మందిని డిస్క్వాలిఫై చేయండి : డి. శ్రీనివాస్

పార్టీ విప్‌ను ధిక్కరించిన తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్‌కు సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడైన డి. శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి ఈ మేరకు పిటీషన్ అందజేశారు.
 
ప్రభుత్వం కౌన్సిల్ ఛైర్మన్ ఎన్నికను హడావుడిగా నిర్వహించినందున తాము ఎన్నికను బహిష్కరించి, సభ నుంచి వాకౌట్ చేశామని వారు అందులో పేర్కొన్నారు. చైర్మన్ ఎన్నిక గురించి ప్రభుత్వం తమతో ముందే మాట్లాడి ఉంటే సహకరించే వాళ్ళమని అన్నారు. ఛైన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా స్వామిగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ పోటీ చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కెఆర్ ఆమోస్, భానుప్రసాద్ తోపాటు పలువురు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి బహిష్కరణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనను తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పార్టీ నుంచి బహిష్కరించారు.