బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (11:20 IST)

టీఆర్ఎస్‌లోకి డీఎస్ జంప్: వద్దని బ్రేక్ వేస్తోన్న బాజిరెడ్డి గోవర్ధన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధినేత డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి. డీఎస్ టీఆర్ఎస్‌లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. టీఆర్ఎస్‌లో చేరేందుకు డీఎస్ మానసికంగా రెడీ అయిపోయారమి ఓ పత్రికలో కథనం రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
మరోవైపు ఇంతకాలం కాంగ్రెస్‌కు వెన్నెముకలా నిలిచిన డీఎస్ పార్టీ మారితే... తెలంగాణలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టవుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొన్నట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు డీఎస్‌ను కలవడానికి ప్రయత్నించారు. కానీ, డిగ్గీరాజాతో మాట్లాడటానికి కూడా డీఎస్ సుముఖత వ్యక్తం చేయలేదు.
 
ఇంకా తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకుంది డిగ్గీనేనని అని డీఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, సొంత పార్టీలో అవమానాలు పడేకంటే, పార్టీ ఫిరాయించడమే మేలనే యోచనలో డీఎస్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు, డీఎస్ రాకను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.