గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (09:44 IST)

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు: దిగ్విజయ్

హైదరాబాద్‌, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉందని అందువల్ల మరో ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్ పేరును ఎలా పెడతారంటూ ఆయన ప్రశ్నించారు. 
 
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉండగా, మరో పేరు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఇదే అంశంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 
 
ఇకపోతే... మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం పోటీ చేయబోతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని డివిజన్లలో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ మొదటి నుంచి మతతత్వ శక్తులతో శక్తులతో పోరాడుతూనే ఉందని దిగ్విజయ్ గుర్తుచేశారు.