గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:58 IST)

డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డిపై 420 కేసు నమోదు!

కాంగ్రెస్ పార్టీకి చెందిన గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డిపై 420 కేసు నమోదైంది. అనుమతులకు మించి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై ఈ కేసు నమోదు చేసినట్టు ధరూర్ ఎస్‌ఐ అంజద్‌ఆలి తెలిపారు. 
 
మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నాపురం శివారులో డీకే స్నిగ్ధారెడ్డికి సంబంధించిన క్రషర్ ప్లాంట్‌లో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ చేపట్టారని మైనింగ్ ఏడీఏ కృష్ణప్రసాద్ ఇటీవల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 
 
మన్నాపురం శివారులో ఒక హెక్టారుకు అనుమతి తీసుకొని, సర్వేనంబర్ 135-327లో అనుమతులకు మించి 6,16,239 క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. 
 
హైకోర్టు ఆదేశాల మేరకు మైనింగ్ డైరెక్టర్‌ను అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ ఏడీఏ కృష్ణప్రసాద్ ఫిర్యాదు చేయడంతో స్నిగ్ధారెడ్డిపై పీపీ యాక్టు కింద ఐపీసీ 420, 447, 379 కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.