Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పొల్యూషన్ ఫ్రీ వెహికల్... హైదరాబాద్ నగర రోడ్లపై ఈ-రిక్షాలు

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (11:51 IST)

Widgets Magazine
e-rickshaws

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభిన్నంగా ఆలోచన చేయనుంది. ఇందులోభాగంగా, హైదరాబాద్ నగర రోడ్లపైకి ఈ-రిక్షాలను ప్రవేశపెట్టనుంది. ఈ–రిక్షాలకు అధీకృత డీలర్లుగా ఆరు సంస్థలకు రవాణా శాఖ అనుమతిచ్చింది. వీటిలో రెండు స్థానిక సంస్థలు కాగా, మిగతావి వేరే ప్రాంతాలకు చెందినవి. 
 
పటాన్‌‌చెరులో ఓ కంపెనీ త్వరలో వీటి తయారీ ప్రారంభించనుంది. ఈ-రిక్షా ధర దాదాపు రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి బ్యాటరీ చార్జి చేస్తే 70-90 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. పర్మిట్‌తో సంబంధం లేకుండా రోడ్లపైకి రానున్నాయి. కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించింది. ఈ-రిక్షా నడిపేవారు ప్రత్యేక లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. డీలర్లు నిర్వహించే పది రోజుల డ్రైవింగ్‌ శిక్షణ తరగతులకు హాజరైన వారికే ఈ లైసెన్స్‌ జారీ చేస్తారు. ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ దాఖలు చేయాలనే నిబంధన అమలులో ఉంటుంది.
 
అయితే, ఈ-రిక్షాలను నడిపేందుకు అనుభవం ఉన్నవారికే అనుమతి ఇవ్వనున్నారు. 20 ఏళ్ల వయసు నిండిన వారికే ఈ వాహనాన్ని నడిపే అనుమతి ఇస్తారు. ఈ-రిక్షా నడపాలంటే కనీసం ఎనిమిదో తరగతి వరకు చదివి ఉండాలన్న నిబంధన కూడా విధించారు. ఆటో, లైట్‌ వెయిట్‌ మోటార్‌ వాహనాల లైసెన్స్‌ ఉండాలి. రవాణా వాహనాలు నడిపే వారికి అంతకుముందు లైట్‌ వెయిట్‌ మోటారు వాహన లైసెన్స్‌ పొంది కనీసం ఏడాది గడిచి ఉండాలనే నిబంధన ఉంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శుభవార్త : పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియను మరింత ...

news

నాసా రోవర్ చాలెంజ్ పోటీలకు తెలంగాణ స్టూడెంట్స్ ఎంపిక

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ...

news

"అచ్చే దిన్ కాదు.. ఆకలి భారతం"... 119 దేశాల్లో 100వ స్థానంలో భారత్‌

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. పైగా, అగ్రదేశాలతో ...

news

జయ్ అమిత్ షా ఆరోపణలవై విచారణ జరగాలి : ఆర్ఎస్ఎస్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ...

Widgets Magazine