శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: బుధవారం, 27 జులై 2016 (20:44 IST)

ఎంసెట్- 2 పేపర్ లీకేజీకి రూ.15 కోట్ల ఒప్పందం...

గతంలో కర్ణాటకలో మెడికల్ పీజీ పేపర్‌ను లీక్ చేసిన ముఠాయే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మెడికల్ పీజీ పేపర్ లీకేజీ ప్లాన్ సక్సెస్ అవడంతో ఎంసెట్- 2 ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ లీకేజీకి ఏపీ పోలీసుల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. అసలు కొన్ని వి

గతంలో కర్ణాటకలో మెడికల్ పీజీ పేపర్‌ను లీక్ చేసిన ముఠాయే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మెడికల్ పీజీ పేపర్ లీకేజీ ప్లాన్ సక్సెస్ అవడంతో ఎంసెట్- 2 ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ లీకేజీకి ఏపీ పోలీసుల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. అసలు కొన్ని విద్యాసంస్థలు తెర వెనుక కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో వాటిని వదిలేసే విధంగా చర్యలు ఉంటున్నాయన్న విమర్శలూ మొదలయ్యాయి. 
 
తెలంగాణకు చెందిన విద్యా సంస్థల జోక్యం లేకుండా ఇక్కడ ఎంసెట్ పేపర్ లీకేజీ  ఉండదనే చర్చ మొదలైంది. పెద్ద తలకాయలను వదిలిపెట్టే కార్యక్రమం తెలంగాణాలోనూ మొదలైందన్న విమర్శలు మొదలయ్యాయి. ఎంసెట్ 2 పేపర్ లీకేజీ వ్యవహారంలో జరుగుతున్న తంతుపై ఈ ఆరోపణలు వచ్చాయి.
 
తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ విషయంలో రూ.15 కోట్ల డీల్ జరిగిందని సీఐడీ తేల్చింది. మొత్తం ఐదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. ముందుగా ఎంసెట్ పేపర్ లీక్ చేస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్ష‌లు వసూలు చేసినట్లు తేలింది. మొత్తంమీద 30 మంది నుంచి ఈ వసూళ్లు చేసినట్లు సమాచారం.