శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (20:09 IST)

మరొక్క ఎమ్మెల్యే చేరితే టి.తెదేపా సభ్యులు అధికారికంగా విలీనం...? ఎర్రబెల్లి తెదేపాకు రాజీనామా...

తెలంగాణ తెలుగుదేశం పార్టీ భూస్థాపితమవుతుందని ఆది నుంచి చెపుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు వాస్తవరూపం దాల్చే పరిస్థితి ఇక ఎంతో దూరంలో లేదని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి తను రాజీనామా చేస్తున్నట్లు ఫ్యాక్స్‌లో లేఖ పంపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోయారు. తాజాగా ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ చేరిపోతే ఆ సంఖ్య 9 మందికి చేరుతుంది. తెలంగాణలో తెదేపా గెలుచుకున్న సీట్లు 15. 
 
ఈ 15 మంది ఎమ్మెల్యేల్లో మరో ఒక్క ఎమ్మెల్యే తెరాసలోకి జంప్ అయిపోతే మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చేస్తుంది. అదే జరిగితే తెరాసలో చేరిన తెదేపా ఎమ్మెల్యేలు అధికారిక సభ్యులుగా చెలామణి అవుతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో తెదేపా ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి తెరాసలో చేరిపోతుండటం తెదేపాకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. 
 
మరోవైపు ఒకే ఒక్క ఎమ్మెల్యే కోసం తెరాస చూస్తోంది. అదే జరిగితే తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఇపుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారంతే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతారు. అదే కేసీఆర్ ప్లాన్. దాదాపు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అది కూడా త్వరలోనే జరిగిపోయేట్లు ఉంది.