గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (18:29 IST)

తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం రాజయ్యకు గుండెపోటు... 24 గంటల పాటు...

తాజాగా మాజీ అయిపోయిన ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవలే మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి విదితమే. రాజయ్యకు రక్తపోటు, షుగర్ లెవల్స్ తేడాలు రావడంతో గుండెపోటు వచ్చింది. దీంతో రాజయ్యను కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని హైదర్‌గుడా అపోలో ఆస్పత్రి చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి 24 గంటలపాటు పరిస్థితిని చూడాల్సి ఉందని తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటి రాజయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. స్వైన్ ఫ్లూ దెబ్బకు విలవిలలాడుతున్న నేపధ్యంలో రాజయ్య శాఖకు సంబంధించి వివిధ పదవుల్లో నియమించిన వారిని రాజయ్య తొలగించారు. 
 
తన పేషీలో వున్న వారికి తొలగించి ఇకపై బుద్ధిగా వుంటానని కేసీఆర్‌కి లేఖ రాసినా వేటు పడింది. రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయాన్ని కేసీఆర్ గవర్నర్‌కి లేఖ రాయడం ఆ తర్వాత కడియంకు పదవి అప్పజెప్పడం అంతా జరిగిపోయాయి.