మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2016 (16:36 IST)

తెలంగాణలో ''సున్నా'' శాతం అడ్మిషన్లపై సుప్రీం షాక్.. కొత్త రాష్ట్రంలో పరిస్థితేంటి?

తెలంగాణ రాష్ట్రంలోని 398 ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై సుప్రీం కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ''సున్నా'' శాతం అడ్మిషన్లపై పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఫైర్ అయ్యింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనిషితో సమానమని వ్యాఖ్యానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల భర్తీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 
 
విద్యార్థుల ప్రవేశాలు జరగకపోవడానికి గల కారణాలతో నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిల్లలు స్కూళ్లకు వచ్చేలా ప్రోత్సహించడం లేదని మండిపడింది. అయితే తమకు స్కూళ్లు మూసివేసే ఉద్దేశ్యం లేదని, టీచర్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.