నా భర్త వెళ్లిపోయాడు... వచ్చేయ్, ప్రియుడికి భార్య ఫోన్, మాటేసిన భర్త...

భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇద్దరిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని పోలీసులకు పట్టించాడు ఓ కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆసిఫా వరంగల్‌లో సిఆర్పిఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

couple
TJ| Last Modified సోమవారం, 6 ఆగస్టు 2018 (20:24 IST)
భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇద్దరిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని పోలీసులకు పట్టించాడు ఓ కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆసిఫా వరంగల్‌లో సిఆర్పిఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే జిల్లా హుజూబ్‌నగర్‌కు చెందిన యువతితో 2016లో వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్య, తల్లిదండ్రులతో కలిసి కోదాడలో నివాసముంటున్నారు.
 
కోదాడ నుంచి వరంగల్ దూరంగా ఉండటంతో వారానికి మూడురోజుల పాటు విధుల్లో బాగంగా వెళ్ళి వస్తుంటాడు. మిగతా మూడు రోజులు అక్కడే వుంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్య వేంకటేశ్వర్లు అనే వ్యక్తితో పరిచయం పెట్టుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కానిస్టేబుల్ తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపాడు. 
 
ఆ తరువాత తను కూడా ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి, వెళ్లకుండా సమీపంలోనే దాక్కున్నాడు. భర్త అలా వెళ్ళిన వెంటనే... నా భర్త వెళ్లిపోయాడు... వచ్చేయ్ అంటూ వెంకటేశ్వర్లను ఇంటికి పిలిపించుకుంది ఆ మహిళ. దీంతో భర్త తన ఇంటికి తాళాలు వేసి బంధువులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :