గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (12:45 IST)

ఉచిత వైఫై సర్వీసులు.. హుస్సేన్‌సాగర్ రింగ్‌లో 40 హాట్ స్పాట్‌లు...

హైదరాబాద్ ట్యాక్ బండ్ చుట్టూ పది కిలోమీటర్ల మేర ఉచిత వైఫై సేవలు పొందేందుకు వీలుగా హుస్సేన్ సాగర్ రింగ్‌లో 40 హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేశారు. ఇవి మ్యారియట్‌ హోటల్‌ నుంచి మొదలుకొని అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్‌, నెక్లెస్‌ రోడ్డు నుంచి సంజీవయ్య పార్కు వరకు వీటిని ఏర్పాటు చేశారు. 
 
వీటికి 500 మీటర్ల లోపల ఉన్న వారికి స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ పీసీ, ల్యాప్‌టాప్‌లలో ‘క్యూఎఫ్‌ఐ - బీఎస్‌ఎన్‌ పేరుతో వైఫై సిగ్నల్‌’ చూపిస్తుంది. దాన్ని ఎంచుకోవడం ద్వారా క్వాడ్‌జెన్‌ - బీఎస్‌ఎన్‌ల్‌ పేరుతో లాగిన్‌ పేజీ వస్తుంది. అందులో ఈ మూడు ఆప్షన్‌లు ఉంటాయి. మొదటిది 30 నిమిషాల పాటు ఉచితంగా పొందడం. రెండవది పెయిడ్‌ లాగిన్‌, మూడోది వోచర్‌ లాగిన్‌ ఆప్షన్‌లు ఉంటాయి.
 
మొదటిసారి ఇంటర్‌నెట్‌ వాడాలకున్న వారు క్యూఎఫ్‌ఐ - బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరుతో వైఫై సిగ్నల్‌కు కనెక్ట్‌ కావాలి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్‌పై ఉచిత (కాంప్లిమెంటరీ) లాగిన్‌ పేజీ కనిపిస్తుంది. అందులో పేరు, మొబైల్‌ నంబరు, ఈ మెయిల్‌ ఐడీలను ఎంటర్‌ చేయాలి. ఆ వెంటనే మీ మొబైల్‌కు ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) వస్తుంది. 
 
అదే నంబరును మళ్లీ ఎంటర్‌ చేయగానే మీరు ఇంటర్‌నెట్‌ను పొందే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ఉచితంగా 30 నిమిషాల పాటు వైఫై ద్వారా ఇంటర్‌నెట్‌ను పొందవచ్చు. ఉచితం అయిపోయిన తర్వాత డబ్బులు చెల్లించి లేదా ప్రత్యేకంగా ముద్రించిన వోచర్లను కొనుగోలు చేయడం ద్వారా ఆయా వైఫై యాక్సెస్‌ పాయింట్ల దగ్గర నుంచి ఇంటర్‌నెట్‌ను పొందవచ్చు.